కోలుకుంటున్న సౌదీ అరేబియా...!

ABN , First Publish Date - 2020-08-16T19:23:25+05:30 IST

సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది.

కోలుకుంటున్న సౌదీ అరేబియా...!

రియాద్: సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. కోవిడ్-19 నుంచి సౌదీ కోలుకుంటోంది. పాజిటివ్ కేసులు త‌గ్గ‌డంతో పాటు అంత‌కంత‌కు రిక‌వరీలు పెరుగుతున్నాయి. శ‌ని‌వారం దేశ‌వ్యాప్తంగా 1,413 కొత్త కేసులు నమోదు కాగా... 1,528 రిక‌వ‌రీలు న‌మోద‌యిన‌ట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్ బారిన ప‌డ్డ వారు 2,97,315 మంది అయితే... మొత్తం రివ‌క‌రీలు 2,64,487 అయ్యాయి. కాగా, నిన్న సంభ‌వించిన 31 మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు సౌదీ వ్యాప్తంగా 3,369 మందిని కోవిడ్ క‌బ‌ళించింది.


ప్ర‌స్తుతం దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో 29,459 మంది క‌రోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 1,766 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే... విశ్వ‌‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న ఈ మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే 7 ల‌క్ష‌ల 69 వేల‌ మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. అలాగే ఇప్ప‌టివ‌ర‌కు రెండు కోట్ల 16 ల‌క్ష‌ల మందికి ప్ర‌బ‌లింది.    


Updated Date - 2020-08-16T19:23:25+05:30 IST