హజ్ యాత్రికులకు సౌదీ నిబంధనలు
ABN , First Publish Date - 2020-07-08T13:35:16+05:30 IST
‘‘ప్లాస్టిక్ బాటిళ్లలో నింపిన జమ్జమ్ బావి నీళ్లే తాగాలి.. ‘షైతాన్’ను తరిమేందుకు భక్తులు విసిరే గుళక రాళ్లను స్టెరిలైజ్ చేసి బస్తాల్లో నింపి ఉంచినవే వినియోగించాలి.. భక్తులు సొంత రగ్గులను వెంట తీసుకెళ్లాలి..’’

రియాద్, జూలై 7: ‘‘ప్లాస్టిక్ బాటిళ్లలో నింపిన జమ్జమ్ బావి నీళ్లే తాగాలి.. ‘షైతాన్’ను తరిమేందుకు భక్తులు విసిరే గుళక రాళ్లను స్టెరిలైజ్ చేసి బస్తాల్లో నింపి ఉంచినవే వినియోగించాలి.. భక్తులు సొంత రగ్గులను వెంట తీసుకెళ్లాలి..’’ ఇవీ ఈ సారి హజ్ యాత్రికులు పాటించాల్సిన నిబంధనలు. కరోనా మహమ్మారి నేపథ్యంలో హజ్ యాత్రికులకు సౌదీ అరేబియా ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది.