సీబీఎస్ఈ ఎగ్జామ్స్ వాయిదా వేసిన కువైట్, సౌదీ

ABN , First Publish Date - 2020-03-13T19:21:48+05:30 IST

కరోనావైరస్(కొవిడ్-19)తో గల్ఫ్ దేశాలు అల్లాడిపోతున్నాయి.

సీబీఎస్ఈ ఎగ్జామ్స్ వాయిదా వేసిన కువైట్, సౌదీ

రియాధ్, కువైట్ సిటీ: కరోనావైరస్(కొవిడ్-19)తో గల్ఫ్ దేశాలు  అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారి క్రమంగా తీవ్ర ప్రభావం చూపుతుండడంతో గల్ఫ్ దేశాలు జాగ్రత్తపడుతున్నాయి. ఇప్పటికే ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. విద్యాసంస్థల మూసివేతలు, పార్టీలు, బహిరంగ ప్రదేశాల్లో జన సమూహాలను కూడా అనుమతించడం లేదు. ఈ క్రమంలో తాజాగా కువైట్, సౌదీ అరేబియాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండు దేశాలు సీబీఎస్ఈ ఎగ్జామ్స్ వాయిదా వేశాయి.


సౌదీలో మార్చి 13 నుంచి జరగాల్సిన సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అక్కడి వివిధ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపించాయి. త్వరలోనే పరీక్షల నిర్వహణకు కొత్త తేదీలు ప్రకటిస్తామని పేర్కొన్నాయి. రియాధ్‌లోని భారత ఎంబసీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 


సౌదీ బాటలోనే కువైట్ కూడా పది, పన్నెండో తరగతి సీబీఎస్ఈ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలకు కువైట్ సర్కార్ సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కువైట్ విద్యాశాఖ, హోం మంత్రిత్వశాఖ సూచన మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Updated Date - 2020-03-13T19:21:48+05:30 IST