సౌదీలో ఆ శిక్షలు రద్దు..

ABN , First Publish Date - 2020-04-26T13:53:00+05:30 IST

సౌదీ అరేబియాలో కొరడా దెబ్బల శిక్షకు కాలం చెల్లింది. సంస్కరణల్లో భాగంగా సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ దానిని రద్దు చేసినట్టు సుప్రీంకోర్టు తెలిపింది.

సౌదీలో ఆ శిక్షలు రద్దు..

ఆ శిక్షలను రద్దు చేసిన రాజు

రియాద్‌, ఏప్రిల్‌ 25: సౌదీ అరేబియాలో కొరడా దెబ్బల శిక్షకు కాలం చెల్లింది. సంస్కరణల్లో భాగంగా సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ దానిని రద్దు చేసినట్టు సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టులు విధించే శిక్ష కింద కొరడా దెబ్బలు ఒక్కోసారి వందకుపైగా దాటిపోతుండటంతో మానవ హక్కుల సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలకు అనుగుణంగా సౌదీలో తాజా సంస్కరణ తీసుకొచ్చారు. వివాహేతర సంబంధాలు వంటి నేరాలు రుజువైనప్పుడు కోర్టులు దోషులకు కొరడా దెబ్బల శిక్షలు విధిస్తుంటాయి. ఇవి రద్దు కావడంతో ఇకపై కోర్టులు ఆయా నేరాలకు సంబంధించి జరిమానాలు లేదా జైలు శిక్ష వంటి శిక్షలను విధించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. 

Updated Date - 2020-04-26T13:53:00+05:30 IST