కరోనా వైరస్.. ముందస్తు చర్యల్లో రువాండ భేష్!

ABN , First Publish Date - 2020-03-13T21:46:08+05:30 IST

రువాండ.. ఆఫ్రికా ఖండంలో ఓ చిన్న దేశం. అయితేనేం.. అగ్రరాజ్యాధినేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌.. సరిహద్దు దాటి ఆ దేశం

కరోనా వైరస్.. ముందస్తు చర్యల్లో రువాండ భేష్!

న్యూఢిల్లీ: రువాండ.. ఆఫ్రికా ఖండంలో ఓ చిన్న దేశం. అయితేనేం.. అగ్రరాజ్యాధినేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌.. సరిహద్దు దాటి ఆ దేశంలోకి ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల ఫలితంగా.. ఇప్పటి వరకు అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇంతకీ.. కరోనా వైరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా అక్కడి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందంటే..


ప్రజలు తరచూ చేతులను శుభ్రం చేసుకునేందుకు వీలుగా పోర్టబుల్ సింక్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రైవేటు సంస్థలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, బస్టాపుల్లో, రెస్టారెంట్లలో, షాపింగ్ మాల్స్‌లో పోర్టబుల్ సింక్‌లు వెలిశాయి. పోర్టబుల్ సింక్‌లను ప్రజలు వినియోగించుకునేలా.. తగిన సూచనలు చేసింది. అంతేకాకుండా.. ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణం చేయాలంటే.. పోర్టబుల్ సింక్‌ల వద్ద చేతులను శుభ్రం చేసుకోవాల్సిందే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ప్రయాణం చేయాలని చూస్తే.. వారికి రవాణా వ్యవస్థ నుంచి ఎటువంటి సహకారం అందకుండా చర్యలు తీసుకుంది.


కాగా.. చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలకు పాకిన విషయం తెలిసిందే. దీని కారణంగా ఇప్పటి వరకు దాదాపు 5వేల మంది మరణించారు. 


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2020-03-13T21:46:08+05:30 IST