భర్తకు విడాకులిచ్చి కొడుకును వివాహమాడిన తల్లి.. రష్యాలో..

ABN , First Publish Date - 2020-07-16T00:37:12+05:30 IST

రష్యాకు చెందిన మరీనా బాల్మషెవా(35) అనే సోషల్ మీడియా స్టార్ 20 ఏళ్ల కొడుకును వివాహమాడింది.

భర్తకు విడాకులిచ్చి కొడుకును వివాహమాడిన తల్లి.. రష్యాలో..

మాస్కో: రష్యాకు చెందిన మరీనా బాల్మషెవా(35) అనే సోషల్ మీడియా స్టార్ 20 ఏళ్ల కొడుకును వివాహమాడింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అయితే మరీనా పెళ్లాడింది కన్నకొడుకును కాదు. ఎన్నో ఏళ్ల క్రితం తాను దత్తత తీసుకున్న వ్లాడిమిర్(20) అనే కుర్రవాడిని మరీనా పెళ్లి చేసుకుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. రష్యాలోని రాస్‌నొడార్ రాయ్ ప్రాంతానికి చెందిన మరీనా అలెక్సీ(45) అనే వ్యక్తిని 2007లో వివాహం చేసుకుంది. ఆ తరువాత భార్యాభర్తలిద్దరూ ఐదుగురు పిల్లలను దత్తత తీసుకున్నారు. అయితే 2017 తరువాత మరీనా అలెక్సీకి విడాకులు ఇచ్చేసింది. దత్తత తీసుకున్న పిల్లల్లో ఒకరు అలెక్సీ దగ్గర పెరుగుతుండగా.. మిగతా నలుగురు మరీనాతో ఉంటూ వస్తున్నారు. ఈ నలుగురిలో ఒకరైన వ్లాడిమిర్‌తోనే మరీనా ప్రేమలో పడింది. 15 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికి వ్లాడిమిర్ కూడా మరీనాను గాఢంగా ప్రేమించాడు. దీంతో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు మరీనా మే నెలలో ఓ ఫొటో షేర్ చేసింది. 


మరీనా షేర్ చేసిన ఫొటోలో 13 ఏళ్ల క్రితం వ్లాడిమిర్‌తో దిగిన ఫొటో.. ప్రస్తుతం దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. ఇక రెండు నెలల తరువాత ఇప్పుడు వాళ్లిద్దరూ లోకల్ రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. త్వరలోనే ఓ బాబుకు కూడా జన్మనివ్వబోతున్నట్టు చెప్పారు. తమ జంటను చూసి కొంతమంది ఆనందిస్తున్నారని.. మరికొంతమంది తమ పెళ్లిని వ్యతిరేకిస్తున్నారని మరీనా చెప్పుకొచ్చింది. ఎవరు ఏమి అనుకున్నా తామిద్దరం మాత్రం సంతోషంగా ఉన్నట్టు తెలిపింది. తమ పెళ్లిని తన మాజీ భర్త కూడా వ్యతిరేకించవచ్చని మరీనా చెబుతోంది. జీవితం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేమని.. దానికి తామే సాక్ష్యమని మరీనా అంటోంది. కాగా.. నెటిజన్లు మాత్రం మరీనాపై విరుచుకుపడుతున్నారు. కొడుకులా పెంచిన వ్యక్తితో పెళ్లి చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.   


Video Credits: Viral story

Updated Date - 2020-07-16T00:37:12+05:30 IST