రష్యాలో రికార్డు స్థాయిలో నమోదైన కరోనా కేసులు.. ఒకేరోజు..

ABN , First Publish Date - 2020-12-06T00:12:11+05:30 IST

రష్యాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. ఒకేరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో

రష్యాలో రికార్డు స్థాయిలో నమోదైన కరోనా కేసులు.. ఒకేరోజు..

మాస్కో: రష్యాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. ఒకేరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 28,782 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఫెడరల్ రెస్పాన్స్ సెంటర్ శనివారం వెల్లడించింది. రష్యాలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. డిసెంబర్ మూడో తేదీన 28,145 కేసులు బయటపడగా.. తాజాగా నమోదైన కేసుల సంఖ్య మరింత పెరిగింది. కొత్తగా నమోదైన కేసులతో రష్యాలో ఇప్పటివరకు మొత్తం 24,31,731 కరోనా కేసులు నమోదయ్యాయి.


మరోపక్క దేశంలో కరోనా బారిన పడి ఒకేరోజు 569 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 42,684కు చేరుకుంది. ఇక ఒకేరోజు కరోనా నుంచి 27,644 మంది కోలుకోవడంతో.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,16,396కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలున్నాయి. 

Updated Date - 2020-12-06T00:12:11+05:30 IST