రష్యాను వణికిస్తున్న మహమ్మారి.. ఒక్కరోజులోనే..

ABN , First Publish Date - 2020-07-16T03:55:42+05:30 IST

రష్యాలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటల్లో

రష్యాను వణికిస్తున్న మహమ్మారి.. ఒక్కరోజులోనే..

మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 6,422 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 7,46,369కి చేరింది. మొత్తంగా 85 ప్రాంతాల నుంచి ఈ కేసులు బయటపడినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాజధాని మాస్కోలో అత్యధికంగా 628 కేసులు నమోదయ్యాయని.. ఆ తర్వాత సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 264 మంది కరోనా బారిన పడినట్టు చెప్పింది. మొత్తంగా నమోదైన కేసుల్లో 1,708 మందికి ఎటువంటి కరోనా లక్షణాలు లేవని.. అయినప్పటికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 156 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,770కి చేరింది. ఇక కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఒకేరోజు 10,424 మంది డిశ్చార్జ్ అయ్యారు. రష్యాలో ఇప్పటివరకు 5,23,249 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 2.37 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్ దేశాలున్నాయి. కేసుల విషయంలో ఏ దేశానికి అందనంత ఎత్తులో అమెరికా ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 34 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-07-16T03:55:42+05:30 IST