ఆగని కరోనా ఉధృతి.. 4 లక్షలు దాటేసిన రష్యా!

ABN , First Publish Date - 2020-06-01T13:59:52+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. రష్యాలో పాజిటివ్‌ కేసులు నాలుగు లక్షల మార్కుని దాటేశాయి. ఆదివారం ఒక్కరోజే ఇక్కడ 9

ఆగని కరోనా ఉధృతి.. 4 లక్షలు దాటేసిన రష్యా!

  • బ్రెజిల్‌, అమెరికాలో ఆగని కరోనా ఉధృతి


మాస్కో, మే 31: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. రష్యాలో పాజిటివ్‌ కేసులు నాలుగు లక్షల మార్కుని దాటేశాయి. ఆదివారం ఒక్కరోజే ఇక్కడ 9,268 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,05,843కి పెరిగింది. గత 24 గంటల్లో వైరస్‌ కారణంగా 138 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 4,693కి చేరుకుంది. చైనాలో కొత్తగా ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో చైనాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 83,001కి చేరుకుంది. అమెరికాలో కొత్తగా 21,317మందికి పాజిటివ్‌గా తేలగా.. బ్రెజిల్‌లో 32,475 మందికి వైరస్‌ సోకింది. కాగా.. కరోనా కారణంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు పరిహారం అందించే బిల్లుకు న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కుమో శనివారం ఆమోదం తెలిపారు. సింగపూర్‌లో మరో 518 కేసులు బయటపడ్డాయి. కేసులు ఈ స్థాయిలో నమోదవుతున్నప్పటికీ రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నిబంధనలను సోమవారం నుంచి ఎత్తివేసేందుకు సింగపూర్‌ సిద్ధమైంది. దక్షిణ కొరియాలో కొత్తగా 27 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


Updated Date - 2020-06-01T13:59:52+05:30 IST