అగ్రరాజ్యంలో అంతకంతకు పెరుగుతున్న నిరుద్యోగిత !
ABN , First Publish Date - 2020-07-10T13:15:53+05:30 IST
లాక్డౌన్తో మార్చిలో మూసేసిన పలు వ్యాపార సంస్థలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినా అమెరికాలోని నిరుద్యోగిత చెప్పుకోదగినంతగా దిగిరాలేదు.

సహాయానికి వారంలో 13లక్షల మంది దరఖాస్తు
వాషింగ్టన్, జూలై 9: లాక్డౌన్తో మార్చిలో మూసేసిన పలు వ్యాపార సంస్థలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినా అమెరికాలోని నిరుద్యోగిత చెప్పుకోదగినంతగా దిగిరాలేదు. జూన్లో 48లక్షల మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరిన తర్వాత కూడా నిరుద్యోగ సూచీ 11.1శాతం కంటే తగ్గలేదు. అది అంతకు ముందు 13.3ుగా ఉంది. కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరగవచ్చనే అంచనాల నేపథ్యంలో నిరుద్యోగం మరోమారు ప్రమాదకర స్థాయికి చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. కరోనా విజృంభణతో పలు రాష్ట్రాలు ఇప్పటికే వ్యాపార సడలింపులను రద్దు చేశాయి. గత వారం 13లక్షల మందికి పైగా నిరుద్యోగులు సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.