భారతీయులకు భారంగా మారిన బ్రిటన్ నిర్ణయం..!
ABN , First Publish Date - 2020-03-13T23:00:15+05:30 IST
దీర్ఘకాల వీసాలపై బ్రిటన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌కు వలస వచ్చే వారిపై విధించే హెల్త్ ఫీజును అమాంతం 224 పౌండ్లు పెంచింది. భారత సంత

లండన్: దీర్ఘకాల వీసాలపై బ్రిటన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌కు వలస వచ్చే వారిపై విధించే హెల్త్ ఫీజును అమాంతం 224 పౌండ్లు పెంచింది. భారత సంతతికి చెందిన రిషి సునక్.. బ్రిటన్ పార్లమెంట్‌లో తాజాగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బ్రిటన్‌కు వలస వచ్చే వారిపై విధించే హెల్త్ ఫీజును 400 పౌండ్ల నుంచి 624పౌండ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. భారత్ సహా ఇతర దేశాల నుంచి బ్రిటన్‌కు వలస వచ్చే వారు హెల్త్ ఫీజు కింద 624 పౌండ్లు చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అయితే బ్రిటన్ హెల్త్ సర్వీస్ ద్వారా వలసదారులు లబ్ధి పొందొచ్చని రిషి సునక్ తెలిపారు.
కాగా.. ఇమిగ్రేషన్ హల్త్ సర్‌ఛార్జీ(ఐహెచ్‌ఎస్)ని బ్రిటన్ మొదటగా 2015లో అమలు చేసింది. అనంతరం అదనపు నిధులపై దృష్టి సారించిన బ్రిటన్.. 2018 డిసెంబర్‌లో మొదటిసారిగా హెల్త్ ఫీజును 200 పౌండ్ల నుంచి 400 పౌండ్లకు పెంచింది. ఇదిలా ఉంటే.. రిషి సునక్ 2009లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.