దుబాయ్ నుంచి భారత్‌కు చేరుకున్న 189 మంది భారతీయులు..!
ABN , First Publish Date - 2020-06-19T02:51:23+05:30 IST
కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న 189 మంది భారతీయు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న 189 మంది భారతీయులు.. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో గయాకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఇప్పటి వరకు 2.50లక్షల మంది ఇండియాకు చేరుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. కాగా.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం గత నెల 7న ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మిషన్ మూడవ దశ కొనసాగుతోంది.