ఉద్యోగులను ఆశ్చర్యపర్చిన రాస్ అల్ ఖైమాహ్ అధినేత!

ABN , First Publish Date - 2020-06-22T17:31:40+05:30 IST

ఎమిరేట్స్ ఉద్యోగులకు రాస్ అల్ ఖైమాహ్ అధినేత, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ సౌద్ బిన్ నక్ర్ అల్ ఖాసిమ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాస్ అల్ ఖైమా

ఉద్యోగులను ఆశ్చర్యపర్చిన రాస్ అల్ ఖైమాహ్ అధినేత!

రాస్ అల్ ఖైమాహ్: ఎమిరేట్స్ ఉద్యోగులకు రాస్ అల్ ఖైమాహ్ అధినేత, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ సౌద్ బిన్ నక్ర్ అల్ ఖాసిమ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాస్ అల్ ఖైమాహ్ అధినేత.. ఎమిరేట్స్ ఉద్యోగులకు వీడియో సందేశం పంపారు. అందులో ఉద్యోగులను తిరిగి విధులకు హాజరుకావాల్సిందిగా కోరారు. షేక్ సౌద్ బిన్ నక్ర్ అల్ ఖాసిమ్ మాట్లడుతూ.. ‘కరోనా కారణంగా యూఏఈ ఆంక్షలు విధించింది. మహమ్మారి ప్రభావం ప్రపంచపై తీవ్రంగా ఉంది. దేవుడి దయవల్ల, మీ సహకారం వల్ల యూఏఈ కరోనా నుంచి కోలుకుంటోంది. దేశ వ్యాప్తంగా ఆంక్షలు క్రమంగా ఎత్తేస్తున్న నేపథ్యంలో ఉద్యోగులంతా యథావిధిగా ఉద్యోగులకు హాజరుకావాలి’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా.. రాస్ అల్ ఖైమాహ్ అధినేత నుంచి అకస్మాత్తుగా పిలుపురావడంతో ఉద్యోగులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా.. యూఏఈలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో లాక్‌డౌన్ ఎత్తేసిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-06-22T17:31:40+05:30 IST