సూడాన్‌ బాలికకకు కిమ్స్‌లో అరుదైన గుండె సర్జరీ

ABN , First Publish Date - 2020-03-02T14:00:51+05:30 IST

కిమ్స్‌ ఆస్పత్రిలో సుడాన్‌ దేశానికి చెందిన ఆరేళ్ల బాలికకు అరుదైన గుండె సంబంధిత శస్త్రచికిత్స (డబుల్‌ స్విచ్‌ ఆపరేషన్‌)ను చేశారు. ఆ బాలిక గుండెకు సంబంధించిన క

సూడాన్‌ బాలికకకు కిమ్స్‌లో అరుదైన గుండె సర్జరీ

హైదరాబాద్‌ : కిమ్స్‌ ఆస్పత్రిలో సుడాన్‌ దేశానికి చెందిన ఆరేళ్ల బాలికకు అరుదైన గుండె సంబంధిత శస్త్రచికిత్స (డబుల్‌ స్విచ్‌ ఆపరేషన్‌)ను చేశారు. ఆ బాలిక గుండెకు సంబంధించిన కరెక్టెడ్‌ ట్రాన్స్‌పోజిషన్‌ ఆఫ్‌ గ్రేట్‌ ఆర్టరీస్‌ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు వివరించారు. రక్తం గుండెకు కుడివైపున రెండు సిరల ద్వారా  చేరకుండా.. అందుకు భిన్నంగా ఊపిరితిత్తులు, గుండె ద్వారా శరీరంలోకి సరఫరా కావడం ద్వారా ఆ బాలికకకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయి.


దీంతో ఆమెను కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకురాగా పీడియాట్రిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ధర్మాపురం వైద్య బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. చికిత్స చేసి గుండె నుంచి రక్త సరఫరా సాధారణ రీతిలో జరిగే విధంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఆ బాలిక కోలుకుందని వైద్యులు తెలిపారు.


Updated Date - 2020-03-02T14:00:51+05:30 IST