మధ్య ఆసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలి: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2020-04-15T23:58:23+05:30 IST

మధ్య ఆసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తక్షణమే భారత్‌కు తీసుకురావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కొవిడ్-19

మధ్య ఆసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: మధ్య ఆసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం తక్షణమే భారత్‌కు తీసుకురావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కొవిడ్-19 కారణంగా ఆయా దేశాల్లో కంపెనీలు మూతపడటంతో.. అక్కడున్న భారతీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. వారంతా స్వదేశానికి రావాలన్న ఆశతో ఉన్నారని చెప్పారు. ఆయా దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తెచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ కోరారు. స్వదేశానికి తీసుకొచ్చాక క్వారంటైన్‌కు తరలించే ప్రణాళికలు చేయాలన్నారు. Updated Date - 2020-04-15T23:58:23+05:30 IST