ఖ‌తార్‌లో క‌రోనా విజృంభణ‌..!

ABN , First Publish Date - 2020-06-26T19:09:34+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా ఖ‌తార్‌లో రోజురోజుకీ విజృంభిస్తోంది.

ఖ‌తార్‌లో క‌రోనా విజృంభణ‌..!

ఖ‌తార్‌: మ‌హ‌మ్మారి క‌రోనా ఖ‌తార్‌లో రోజురోజుకీ విజృంభిస్తోంది. గురువారం కూడా 1,060 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 91,838 మంది ఈ వైర‌స్ బారిన ప‌డ్డారు. నిన్న ఒకేరోజు 1,461 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇద్ద‌రు కోవిడ్‌తో మృతి చెందారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 74,544కు చేర‌గా... మొత్తం మ‌ర‌ణించిన వారు 106 మంది అయ్యారు. మ‌రోవైపు ఖ‌తార్ ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి నియంత్ర‌ణ‌కు దేశవ్యాప్తంగా ముమ్మ‌రంగా క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తోంది. నిన్న నిర్వ‌హించిన 4,324 కోవిడ్ టెస్టుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,37,500 ప‌రీక్ష‌లు పూర్తి చేసింది.  ఇదిలాఉంటే... ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న‌ ఈ వైర‌స్ ఇప్ప‌టికే 4.91 లక్ష‌ల మందిని బ‌లిగొంది. 97 ల‌క్ష‌లకు పైగా మందికి సోకింది.  ‌

Updated Date - 2020-06-26T19:09:34+05:30 IST