ఖతార్‌లో ఒకేరోజు భారీగా పెరిగిన కరోనా బాధితులు..!
ABN , First Publish Date - 2020-04-28T15:35:32+05:30 IST
ఖతార్‌లో సోమవారం ఒక్కరోజే 957 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఖతార్: అగ్రరాజ్యాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గల్ఫ్‌లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబియా, ఖతార్‌లో కొవిడ్-19 రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తోంది. ఖతార్‌లో సోమవారం ఒక్కరోజే 957 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 11,244కి చేరింది. అలాగే 54 కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారు 1,066 మంది అయ్యారు. నిన్న కొత్త మరణాలు ఏమి నమోదు కాలేదు. కాగా, ఆ దేశంలో మొత్తం కరోనా మరణాలు 10 మాత్రమే ఉండడం ఊరటనిచ్చే విషయం. మరోవైపు ఖతార్ కొవిడ్-19 కట్టడికి టెస్టులు ముమ్మరం చేసింది. సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 85,707 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.