ఒక్కో దేశంలో.. ఒక్కో రీతిలో లాక్‌డౌన్ వ్యతిరేక పోరాటాలు

ABN , First Publish Date - 2020-05-10T03:09:43+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. మరోపక్క ప్రపంచదేశాలు

ఒక్కో దేశంలో.. ఒక్కో రీతిలో లాక్‌డౌన్ వ్యతిరేక పోరాటాలు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. మరోపక్క ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే పోతున్నాయి. అయితే ఇదే సమయంలో అనేక దేశాల్లో లాక్‌డౌన్‌కు వ్యతరేకంగా ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. అమెరికా, జర్మనీ, సెర్బియా తదితర దేశాల్లో వివిధ మార్గాల్లో నిరసనలు చేపడుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేయాలంటూ వందలాది మంది రోడ్లమీదకు వస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ఈ నిరసనలు ఉధృతంగా మారాయి. నిరసనకారులు తుపాకులు కూడా వెంటబెట్టుకుని రోడ్ల మీదకు వస్తున్నారు. జర్మనీలో లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా వందలాది మంది రోడ్లపైకి వచ్చారు. సెర్బియాలో ప్రజలు చప్పట్లు కొడుతూ లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అర్జెంటీనాలో ప్రజలు ప్లేట్లపై కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రజలు వందల మంది గుంపుగా రోడ్లమీదకు రావడంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇలా అయితే కరోనా అదుపులోకి రావడం కష్టమని.. వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-05-10T03:09:43+05:30 IST