ఢిల్లీ అల్లర్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించిన ఎన్నారైలు
ABN , First Publish Date - 2020-03-02T18:12:14+05:30 IST
గత నెల 24, 25 తేదీల్లో దేశరాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో సీఏఏ కారణంగా చెలరేగిన అల్లర్లలో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది గా

న్యూఢిల్లీ: గత నెల 24, 25 తేదీల్లో దేశరాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో సీఏఏ కారణంగా చెలరేగిన అల్లర్లలో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా.. హింసాకాండ వల్ల ప్రభావితం అయిన బాధితులకు సంఘీభావం తెలియజేస్తూ.. యూరప్ దేశాల్లో ప్రవాసులు ర్యాలీలు నిర్వహించారు. లండన్, జెనీవా, బెర్లిన్ సహా 18 ముఖ్య పట్టణాల్లో నిర్వహించిన సంఘీభావ సభలకు సుమారు 1500 మంది ఎన్నారైలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.