కరోనాపై పోరాటంలో సిక్కుల పాత్ర ప్రశంసనీయం: ప్రిన్స్ చార్లెస్

ABN , First Publish Date - 2020-04-15T02:18:03+05:30 IST

వైశాఖి సందర్భంగా యూకేలోని సిక్కు సమాజానికి ప్రిన్స్ చార్లెస్ వీడియో

కరోనాపై పోరాటంలో సిక్కుల పాత్ర ప్రశంసనీయం: ప్రిన్స్ చార్లెస్

లండన్: వైశాఖి సందర్భంగా యూకేలోని సిక్కు సమాజానికి ప్రిన్స్ చార్లెస్ వీడియో సందేశం ద్వారా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంగా యూకేలో కరోనాపై సిక్కులు చేస్తున్న పోరాటాన్ని కూడా ఆయన ప్రశంసించారు. సిక్కులు యూకేలోని వైద్య తదితర రంగాలలో కరోనాను నియంత్రించేందుకు కృషి చేస్తున్నారని ప్రిన్స్ చార్లెస్ కొనియాడారు. ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి వైశాఖిని జరుపుకోలేకపోవడం ఎంత బాధగా ఉంటుందో తాను ఊహించుకోగలనని అన్నారు. కాగా.. ప్రిన్స్ చార్లెస్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కాగా.. సిక్కులు వైశాఖి పండుగను ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ సారి సిక్కు సమాజం ఇళ్లలోనే పండుగను జరుపుకోవాల్సి వచ్చింది. ఆచారం ప్రకారం గురుద్వారాలకు వెళ్లి కీర్తనలు ఆలపిస్తుంటారు. కానీ, లాక్‌డౌన్ విధించడంతో సిక్కులు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

Updated Date - 2020-04-15T02:18:03+05:30 IST