మాస్క్‌ల‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వను: ట్రంప్‌

ABN , First Publish Date - 2020-07-19T13:52:58+05:30 IST

ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించినంత మాత్రాన కరోనా వైరస్‌ పోదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మాస్క్‌ల వల్ల వైరస్‌ అదృశ్యమవుతుందనే వాదనతో ఏకీభవించనని చెప్పారు.

మాస్క్‌ల‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వను: ట్రంప్‌

మాస్క్‌లు ధరిస్తే కరోనా పోతుందా?

ప్రజలకు కొంత స్వేచ్ఛ ఉండాలి

వాషింగ్టన్‌, జూలై 18: ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించినంత మాత్రాన కరోనా వైరస్‌ పోదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మాస్క్‌ల వల్ల వైరస్‌ అదృశ్యమవుతుందనే వాదనతో ఏకీభవించనని చెప్పారు. మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని ప్రజలకు ఆదేశాలు ఇవ్వబోనని కూడా తెలిపారు. బలవంతంగానైనా ప్రజలతో మాస్క్‌లు ధరించేలా చూడాలని అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫాసి నేతలను కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు విరుద్ధంగా ట్రంప్‌ ప్రకటన చేయడం విశేషం. 


Updated Date - 2020-07-19T13:52:58+05:30 IST