కరోనాపై ట్రంప్-మోదీ చర్చ
ABN , First Publish Date - 2020-04-05T08:15:00+05:30 IST
కరోనా వైరస్ కట్టడికి రెండు దేశాలూ పూర్తి శక్తిని వినియోగిద్దామని భారత్, అమెరికా అంగీకారానికి వచ్చాయి

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి రెండు దేశాలూ పూర్తి శక్తిని వినియోగిద్దామని భారత్, అమెరికా అంగీకారానికి వచ్చాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యలపై ట్రంప్, మోదీ శనివారం ఫోన్‌లో చర్చించారు. ‘అన్ని అంశాలనూ విస్తృతంగా చర్చించాం. ఇండో అమెరికా భాగస్వామ్యపు పూర్తి బలాన్ని వాడుకోవాలని నిర్ణయించాం’ అని మోదీ ట్వీట్ చేశారు. వైద్య సామగ్రి కోసం ప్రపంచ దేశాల సాయాన్ని అమెరికా కోరుతోంది. కాగా, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోతోనూ మోదీ ఫోన్‌లో మాట్లాడారు. కరోనాపై రెండు దేశాలు కలిసి పోరాడాలని ఇరువురు అంగీకారానికి వచ్చారు.