గాలిలో ఢీకొని.. కింద‌ప‌డి సరస్సులో మునిగిపోయిన రెండు విమానాలు

ABN , First Publish Date - 2020-07-08T12:55:59+05:30 IST

అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో రెండు విమానాలు గాల్లో ఢీ కొన్న తరవాత కోయర్‌ డీ అలేన్‌ సరస్సులో మునిగిపోయాయి.

గాలిలో ఢీకొని.. కింద‌ప‌డి సరస్సులో మునిగిపోయిన రెండు విమానాలు

సరస్సులో మునిగి..8 మంది మృతి

స్పోకేన్‌ (అమెరికా), జూలై 7: అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో  రెండు విమానాలు గాల్లో ఢీ కొన్న తరవాత కోయర్‌ డీ అలేన్‌ సరస్సులో మునిగిపోయాయి. ఆదివారం మధ్యాహ్నాం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారుల సహా మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. సరస్సులో మునిగిపోయిన విమాన శకలాలను సోనార్‌ సహాయంతో గుర్తించారు. ఇప్పటి వర కు ముగ్గురి మృత దేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢీ కొన్న రెండు విమానాల్లో ఒక దాన్ని సెస్నా 206గా గుర్తించారు. ఇందులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. మరో విమానాన్ని కోయర్‌ డీ అలేన్‌ ప్రాంతానికి చెందిన సీప్లేన్‌గా గుర్తించారు.

Updated Date - 2020-07-08T12:55:59+05:30 IST