రష్యా వ్యాక్సిన్ మూడోదశ ట్రయల్స్‌లోనూ ప్రతికూల ఫలితాలు
ABN , First Publish Date - 2020-09-20T12:03:10+05:30 IST
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయో గ పరీక్షల్లో ఒక వలంటీర్ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనను మరువకముందే.. అలాంటిదే మరో వార్త తెరపైకి వచ్చింది.

ప్రతి ఏడుగురిలో ఒకరికి దుష్ప్రభావాలు
మాస్కో, సెప్టెంబరు 19 : ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయో గ పరీక్షల్లో ఒక వలంటీర్ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనను మరువకముందే.. అలాంటిదే మరో వార్త తెరపైకి వచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి రిజిస్టర్డ్ కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’తో జరుగుతున్న మూడోదశ ట్రయల్స్‌లోనూ స్వల్ప ప్రతికూల ఫలితా లు వస్తున్నాయని స్వయంగా రష్యా ఆరోగ్యశాఖ మం త్రి మిఖాయిల్ మురష్కో వెల్లడించారు. చిట్టచివరి ప్రయోగ దశలో భాగంగా 40వేల మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు దాదాపు 300 మందికి స్పుత్నిక్-విని అందించినట్లు తె లిపారు. ప్రతి ఏడుగురు వలంటీర్లకుగానూ ఒకరి (14 శాతం మంది)లో కండరాల నొప్పి, జ్వరం, నీరసం, శరీరం వేడెక్కడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రతికూలతలన్నీ ఒకరోజు లేదా 36 గంటల తర్వాత పూర్తిగా తగ్గిపోతున్నాయని స్పష్టంచేశారు.