ఫైజర్ సంస్థపై బ్రెజిల్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-12-20T09:25:10+05:30 IST

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఫైజర్ సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా

ఫైజర్ సంస్థపై బ్రెజిల్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

బ్రసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఫైజర్ సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సంస్థకు ఎటువంటి సంబంధం ఉండదని ఆయన అన్నారు. ఫైజర్ సంస్థతో చేసుకునే క్రాంట్రాక్ట్‌లోనే ఈ విషయం స్పష్టంగా ఉంటుందన్నారు. ‘వ్యాక్సిన్ తీసుకుని నువ్వు మొసలిలా మారినా అది నీ సమస్యే. ఒక మహిళకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గెడ్డం పెరగడం మొదలైనా అది ఆమె సమస్యే. ఒక అబ్బాయి గొంతు అమ్మాయి గొంతుగా మారినా అది అతడి సమస్యే’ అంటూ బొల్సొనారో చెప్పుకొచ్చారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాలు ఫైజర్ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ అధికారానికి అనుమతులు ఇచ్చేశాయి. చాలా దేశాలు వ్యాక్సిన్‌ను వెయ్యడం కూడా ప్రారంభించేశాయి. 

Updated Date - 2020-12-20T09:25:10+05:30 IST