ఫైజర్ టీకాకు కువైట్ ఆమోదం.. 10 రోజుల్లో వ్యాక్సినేషన్

ABN , First Publish Date - 2020-12-15T14:08:44+05:30 IST

ఇప్పటికే గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, సౌదీ అరేబియా ఫైజర్ టీకాను ఆమోదించగా.. ఆదివారం కువైట్ కూడా ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఫైజర్ టీకాకు కువైట్ ఆమోదం.. 10 రోజుల్లో వ్యాక్సినేషన్

కువైట్ సిటీ: ఇప్పటికే గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, సౌదీ అరేబియా ఫైజర్ టీకాను ఆమోదించగా.. ఆదివారం కువైట్ కూడా ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, మరో 10 రోజుల్లో టీకా కువైట్ చేరుతుందని ఆ వెంటనే వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్లా అల్ బాదర్ వెల్లడించారు. టీకాపై ఏర్పాటైన కమిటీ సమగ్ర పరిశీలన, క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను సమీక్షించిన తరువాత అనుమతి లభించిందని ఆయన పేర్కొన్నారు. కాగా, కువైట్ ఎన్ని డోసులకు ఆర్డర్ చేసింది మాత్రం అబ్దుల్లా వెల్లడించలేదు. ఇక వ్యాక్సినేషన్ ప్రారంభించిన అనంతరం రోజుకు పది వేల మందికి టీకా ఇవ్వడం జరుగుతుందని కొవిడ్-19 వ్యాక్సినేషన్ కమిటీ మెంబర్ ఖలీద్ అల్ సయీద్ తెలిపారు. ఫ్రంట్‌లైన్ వర్కర్స్, వయో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మొదట టీకా అందిస్తామన్నారు. 


Updated Date - 2020-12-15T14:08:44+05:30 IST