24 గంటల్లోగా వ్యాక్సినేషన్ షురూ: ట్రంప్
ABN , First Publish Date - 2020-12-13T11:57:36+05:30 IST
ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్‌ను అమెరికాలో అత్యవసర ప్రాతిపదికన వినియోగించేందుకు మార్గం సుగమమైంది. అందుకు ఆహార,

వాషింగ్టన్, డిసెంబరు 12: ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్‌ను అమెరికాలో అత్యవసర ప్రాతిపదికన వినియోగించేందుకు మార్గం సుగమమైంది. అందుకు ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎ్‌ఫడీఏ) పూర్తి స్థాయి అనుమతులను మంజూరు చేసింది. ఈనేపథ్యంలో ట్విటర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘మరో ఇరవై నాలుగు గంటల్లోగా ఫైజర్ వ్యాక్సిన్‌తో తొలి వ్యాక్సినేషన్ జరగబోతోంది. అమెరికన్లు అందరికీ ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నాం’’ అని ఆయన ప్రకటించారు. ఫైజర్ కంపెనీ నుంచి తొలుత అందే 30 లక్షల డోసులను వైద్యారోగ్య, సైనిక సిబ్బందితో పాటు వృద్ధులకు వారం రోజుల్లోగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.