స్పీకర్‌కు హ్యాండ్ షేక్ ఇవ్వని ట్రంప్.. స్పీచ్ కాపీని చించేసిన స్పీకర్

ABN , First Publish Date - 2020-02-06T01:58:34+05:30 IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీల మధ్య వైరం మరోమారు బయటపడింది. ట్రంప్ అభిశంసన అంశం మొదలైన నాటి నుంచి వీరిద్దరూ బహి

స్పీకర్‌కు హ్యాండ్ షేక్ ఇవ్వని ట్రంప్.. స్పీచ్ కాపీని చించేసిన స్పీకర్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీల మధ్య వైరం మరోమారు బయటపడింది. ట్రంప్ అభిశంసన అంశం మొదలైన నాటి నుంచి వీరిద్దరూ బహిరంగంగానే అనేక మార్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. వార్షిక ప్రసంగం సందర్భంగా ట్రంప్, నాన్సీలు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. మంగళవారం వార్షిక ప్రసంగాన్ని మొదలుపెట్టే ముందు స్పీకర్ నాన్సీ ట్రంప్‌‌కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయింది. అయితే ట్రంప్ ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ట్రంప్ కావాలనే స్పీకర్‌కు షేక్ హ్యాంక్ ఇవ్వలేదా లేదా టెన్షన్‌లో ఆయన ఇలా చేశారా అన్నది తెలియదు. 


ఇదిలా ఉండగా.. ట్రంప్ ప్రసంగం అనంతరం.. ఆయన వెనుక నిలబడి ఉన్న నాన్సీ ట్రంప్ స్పీచ్‌ కాపీని రెండు ముక్కలుగా చించేశారు. పైనున్న వీడియోలో అక్కడ జరిగిన సంఘటనను చూడవచ్చు. ఇదే విషయంపై నాన్సీని ప్రశ్నించగా.. మర్యాదపూర్వకంగా చేయాల్సిన పనినే తాను చేశానంటూ సమాధానమిచ్చారు. కాగా.. ఈ ఘటనపై ట్రంప్ అడ్వైజర్ స్పందించారు. డెమొక్రాట్స్, రిపబ్లికన్స్ అంటూ ఇప్పటికే అమెరికన్లు రెండుగా విడిపోయిన వాతావరణం కనిపిస్తోందని.. ఇదే సమయంలో ట్రంప్ డెమొక్రట్ పార్టీకి చెందిన నాన్సీకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ట్రంప్ తప్పు చేశారని ట్రంప్ అడ్వైజర్ అన్నారు. అదే విధంగా డెమొక్రాట్లు సైతం ట్రంప్ స్పీచ్‌కు కనీసం చప్పట్లు కొట్టలేదని తప్పుపట్టారు. కాగా.. ట్రంప్ అభిశంసనకు సంబంధించి బుధవారం సెనేట్‌లో ఓటింగ్ జరగనుంది.


Updated Date - 2020-02-06T01:58:34+05:30 IST