అబుధాబి ప్రయాణికులకు ముఖ్య గమనిక!

ABN , First Publish Date - 2020-09-06T17:27:25+05:30 IST

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో నేపథ్యంలో అబుధాబిలోని ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ కమిటీ కీలక ప్రకటన చేసింది. అబుధాబికి వచ్చే ప్రయా

అబుధాబి ప్రయాణికులకు ముఖ్య గమనిక!

అబుధాబి: కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో నేపథ్యంలో అబుధాబిలోని ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ కమిటీ కీలక ప్రకటన చేసింది. అబుధాబికి వచ్చే ప్రయాణికులు.. కరోనా వైరస్‌కు సంబంధించిన పీసీఆర్ లేదా డీపీఐ టెస్టులను చేయించుకుని.. ప్రయాణానికి 42 గంటల ముందే నెగెటివ్ సర్టిఫికెట్ పొందాలని సూచించింది. వరుసగా ఆరు రోజులపాటు అబుధాబిలోనే ఉండే పర్యాటకులు.. ఆరో రోజు పీసాఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ కొత్త నిబంధనలు శనివారం నుంచే అమలులోకి వచ్చినట్ల ప్రకటించింది. ఇదిలా ఉంటే.. యూఏఈలో శనివారం ఒక్కరోజే 705 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మరణించారు. 


Updated Date - 2020-09-06T17:27:25+05:30 IST