ఒక్క దెబ్బకు కోటీశ్వరుడైపోయిన పాకిస్థానీ.. దుబాయిలో..

ABN , First Publish Date - 2020-10-08T13:50:06+05:30 IST

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ విధంగా వరిస్తుందో చెప్పలేం.

ఒక్క దెబ్బకు కోటీశ్వరుడైపోయిన పాకిస్థానీ.. దుబాయిలో..

దుబాయి: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ విధంగా వరిస్తుందో చెప్పలేం. ముఖ్యంగా లాటరీల విషయానికి వస్తే.. ఒక్క లాటరీ తగిలిందంటే రాత్రికి రాత్రే బిచ్చగాడు కూడా బిలియనీర్‌గా మారిపోతాడు. దుబాయిలో పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ షఫీఖ్(48) అనే వ్యక్తి ఒక్క దెబ్బకు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. దుబాయి డ్యూటీ ఫ్రీ మిలెనియమ్ మిలియనీర్ లాటరీ కాంటెస్ట్‌లో మహమ్మద్ పది లక్షల డాలర్ల(రూ. 7 కోట్ల 33 లక్షలు) లాటరీను గెలుపొందాడు. తాను లాటరీ గెలిచానంటే ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదంటూ మహమ్మద్ సంతోషంగా ఎగిరి గంతేస్తున్నాడు. లాటరీలో గెలిచిన డబ్బును తన పిల్లల చదువుకు ఉపయోగిస్తానని మహమ్మద్ చెబుతున్నాడు. తనకు మొత్తం ఏడుగురు సంతానం అని.. ఈ లాటరీ డబ్బుతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని చదివిస్తానని మహమ్మద్ తెలిపాడు.

Updated Date - 2020-10-08T13:50:06+05:30 IST