దుబాయ్ పోలీస్ అధికారికి భారీగా లంచం ఆఫర్ చేసిన పాకిస్తానీ.. చివరికి

ABN , First Publish Date - 2020-10-12T14:26:12+05:30 IST

పోలీసుల నిర్బంధం నుంచి తప్పించుకోవడానికి దుబాయ్‌లో ఓ పాకిస్తానీ ఏకంగా పోలీస్ అధికారికే భారీ మొత్తం లంచం ఆఫర్ చేసి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

దుబాయ్ పోలీస్ అధికారికి భారీగా లంచం ఆఫర్ చేసిన పాకిస్తానీ.. చివరికి

దుబాయ్: పోలీసుల నిర్బంధం నుంచి తప్పించుకోవడానికి దుబాయ్‌లో ఓ పాకిస్తానీ ఏకంగా పోలీస్ అధికారికే భారీ మొత్తం లంచం ఆఫర్ చేసి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తనను నిర్బంధం నుంచి తప్పిస్తే 50వేల దిర్హమ్స్, మెర్సిడెస్ కారు, లగ్జరీ వాచీ, విలువైన మొబైల్ ఫోన్, మంత్లీ 20వేల దిర్హమ్స్ ఇస్తానని ఓ పోలీస్ అధికారికి సదరు పాకిస్తానీ ఆఫర్ చేశాడు. దీంతో పోలీస్ అధికారి అతడి ఆఫర్‌ను ఒప్పుకున్నట్లు నటించి బయట నుంచి తెప్పించిన 15వేల దిర్హమ్స్‌ను సీజ్ చేశారు. అనంతరం ఈ నగదును తీసుకొచ్చిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలా పోలీస్ అధికారి చాకచక్యంగా వ్యవహరించి పాకిస్తానీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జూన్ 18, 19 తేదీల్లో జరిగింది. దీంతో సదరు పాకిస్తాన్ వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిపై కూడా కేసు నమోదైంది. తాజాగా ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. 


కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.... 40 ఏళ్ల పాకిస్తానీ ఓ కేసులో దుబాయ్ పోలీసుల నిర్బంధంలో ఉన్నాడు. అయితే, పోలీసుల నిర్బంధంలో ఉన్న అతడు... అక్కడి నుంచి తప్పించుకోవడానికి స్కేచ్ వేశాడు. దీనిలో భాగంగా ఓ పోలీస్ అధికారితో మాట కలిపిన అతడు... తనను నిర్బంధం నుంచి తప్పిస్తే 50వేల దిర్హమ్స్, మెర్సిడెస్ కారు, లగ్జరీ వాచీ, విలువైన మొబైల్ ఫోన్, మంత్లీ 20వేల దిర్హమ్స్ ఇస్తానని పోలీస్ అధికారికి చెప్పాడు. పాకిస్తానీ ఆఫర్‌ను అంగీకరించినట్లు నటించిన పోలీస్ అధికారి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ముందే ఈ విషయాన్ని మిగత పోలీసులకు వివరించారు. ఇక పోలీస్ అధికారిని పూర్తిగా నమ్మిన పాకిస్తానీ తనకు తెలిసిన వారిని ఫోన్ ద్వారా విషయం చెప్పి 15వేల దిర్హమ్స్ తెప్పించాడు. నగదును తీసుకుని బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌కు ఇద్దరు వ్యక్తులు రాగానే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 15వేల దిర్హమ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాకిస్తానీతో పాటు అతనికి సహకరించిన ఆ ఇద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. ప్రస్తుతం విచారణ దశలో ఉన్న ఈ కేసు తుది తీర్పు అక్టోబర్ 25న వెలువడనుంది.               

 


Updated Date - 2020-10-12T14:26:12+05:30 IST