పాక్ తొలి సిక్కు మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ అరుదైన ఘ‌న‌త..!

ABN , First Publish Date - 2020-05-17T18:17:59+05:30 IST

30 ఏళ్లలోపు టాప్ 100 ప్రభావవంతమైన సిక్కులలో పాకిస్తాన్ తొలి సిక్కు మహిళా జర్నలిస్ట్ మ‌న్మీత్ కౌర్‌(25)కు చోటు ద‌క్కింది.

పాక్ తొలి సిక్కు మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ అరుదైన ఘ‌న‌త..!

ఇస్లామాబాద్: 30 ఏళ్లలోపు టాప్ 100 ప్రభావవంతమైన సిక్కులలో పాకిస్తాన్ తొలి సిక్కు మహిళా జర్నలిస్ట్ మ‌న్మీత్ కౌర్‌(25)కు చోటు ద‌క్కింది. బ్రిట‌న్‌కు చెందిన సిక్కు గ్రూపు సంస్థ  ప్ర‌తి యేటా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30 ఏళ్లలోపు అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన 100 మంది సిక్కు వ్య‌క్తుల‌ను ఎంపిక చేసి అవార్డుల‌తో స‌త్క‌రిస్తోంది. ఈ ఏడాది 100 ప్రభావవంతమైన సిక్కులలో పాక్ మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ మ‌న్మీత్ కౌర్ చోటు ద‌క్కించుకున్నారు. వ‌చ్చే ఏడాది బ్రిట‌న్‌లో జ‌రిగే పుర‌స్కారాల‌ ప్ర‌దానోత్స‌వంలో మ‌న్మీత్ అవార్డు అందుకోనున్నారు. 


పాక్‌లోని పెషావ‌ర్‌కు చెందిన మ‌న్మీత్ కౌర్ జ‌ర్న‌లిస్టుతో పాటు మంచి సామాజిక కార్య‌క‌ర్త కూడా. దీంతో‌ అక్క‌డి మైనారిటీలు, మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఎత్తిచూపినందుకు ఆమె అవార్డు అందుకున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన సిక్కు వ్యక్తుల జాబితాలో త‌న పేరు ఉండ‌డం పట్ల ఆమె ఆనందం వ్య‌క్తం చేశారు. "కష్టపడి పనిచేసే వారు త‌ప్ప‌కుండా ప్రతిఫలాలను పొందుతారు. యూకేని  సందర్శించడం, పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం నా కుటుంబానికి గొప్ప గౌరవం"  అని మ‌న్మీత్ కౌర్ తెలిపారు.  

Updated Date - 2020-05-17T18:17:59+05:30 IST