వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన పాయిజన్‌ను గుర్తించిన అధికారులు

ABN , First Publish Date - 2020-09-20T10:49:18+05:30 IST

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రాణాంతకమైన ఈ పాయిజన్‌ను ఎవరో తెలియని వ్యక్తులు పంపినట్టు తెలుస్తోంది.

వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన పాయిజన్‌ను గుర్తించిన అధికారులు

వాషింగ్టన్: అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన్ పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రాణాంతకమైన ఈ పాయిజన్‌ను ఎవరో తెలియని వ్యక్తులు పంపినట్టు తెలుస్తోంది. వైట్‌హౌస్‌కు వచ్చే లెటర్లు, ప్యాకేజీలు ముందుగా ఆఫ్‌సైట్ ఫెసిలిటీలో చెకింగ్‌కు వెళ్తాయి. ఈ చెకింగ్‌లో భాగంగానే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పాయిజన్ ఉన్న ప్యాకేజీని గుర్తించారు. ఈ ప్యాకేజీ కెనడా నుంచి వచ్చినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ), సీక్రెట్ సర్వీస్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 


కాగా.. రైసిన్ పాయిజన్‌ను ఉగ్రవాద దాడుల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఈ పాయిజన్‌ను చిన్న గోలీలుగా, యాసిడ్‌గా, పౌడర్‌గా, ద్రవంగా ఉపయోగిస్తారు. ఈ పాయిజన్‌ను ఎవరైనా తీసుకుంటే.. వారికి వెంటనే వాంతులు అవుతాయి. అంతేకాకుండా కడుపు, పేగుల్లో ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది. అంతేకాకుండా కిడ్నీలు, కాలేయం ఫెయిల్యూర్ అయి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. 

Updated Date - 2020-09-20T10:49:18+05:30 IST