తుది దశ ట్రయల్స్‌కు ఆక్స్‌ఫర్డ్ 'కోవిడ్‌ వ్యాక్సిన్‌'

ABN , First Publish Date - 2020-06-26T13:58:51+05:30 IST

కొవిడ్‌-19 ఆటకట్టించేందుకు.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా ఫార్మా కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్‌ తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో శాస్త్రజ్ఞులు కొవిడ్‌-19ను నిరోధించే వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమై ఉన్నారు.

తుది దశ ట్రయల్స్‌కు ఆక్స్‌ఫర్డ్ 'కోవిడ్‌ వ్యాక్సిన్‌'

యూకేలో 10,260 మందిపై పరీక్ష

విజయవంతమైతే ఏడాది చివరికి అందుబాటులోకి!

లండన్‌, జనవరి 25: కొవిడ్‌-19 ఆటకట్టించేందుకు.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా ఫార్మా కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్‌ తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో శాస్త్రజ్ఞులు కొవిడ్‌-19ను నిరోధించే వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమై ఉన్నారు. వాటిలో తుది దశ ట్రయల్స్‌కు చేరుకున్న తొలి వ్యాక్సిన్‌ ఇదే. సాధారణ జలుబు కారక వైరస్‌ (ఎడెనో వైర్‌స)ను బలహీనపరిచి (సీహెచ్‌ఏడీఓఎక్స్‌1) దాన్నుంచి ‘సీహెచ్‌ఏడీఓఎక్స్‌1 ఎన్‌సీవోవీ-19’ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు.


తుది దశ పరీక్షల్లో భాగంగా యూకేలో 10,260 మందికి ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. వారిలో అన్ని వయసులవారూ ఉన్నారు. కాగా, ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో కూడా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. అలాగే, భారత్‌ సహా పలు ఇతర పేద దేశాలకు 100 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది.  అంటే మన కరెన్సీలో దాదాపు రూ.750 కోట్లు. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి క్లినికల్‌ స్టడీ్‌సలో పురోగతి కనిపిస్తోందని.. పెద్దల్లో రోగనిరోధక శక్తిని ఈ వ్యాక్సిన్‌ ఎలా ప్రేరేపిస్తుందో తెలుసుకునేందుకు తదుపరి ప్రయోగాలు నిర్వహిస్తున్నామని ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్‌ ఆండ్రూ పొలార్డ్‌ తెలిపారు.   తుది దశ ప్రయోగాలు కూడా విజయవంతమైతే.. ఈ ఏడిది చివరికల్లా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే.. అత్యంత వేగంగా వినియోగానికి అనుమతులు పొందిన వ్యాక్సిన్‌గా ఇది చరిత్ర సృష్టించనుంది. కాగా.. మరో 13 వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోను, 129 వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్‌ 22న ప్రకటించింది. క్లినికల్‌ దశలో ఉన్నవాటిలో.. అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్‌, చైనాకు చెందిన సినోవాక్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ వచ్చే నెలలో తుది దశకు చేరనున్నాయి.  

Updated Date - 2020-06-26T13:58:51+05:30 IST