అంతరిక్షంలో షూటింగ్‌కు సిద్దమవుతున్న హాలీవుడ్ నటుడు

ABN , First Publish Date - 2020-09-24T10:34:56+05:30 IST

డేరింగ్ స్టంట్స్‌ చేయడంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ఎప్పుడూ ముందుంటారనే

అంతరిక్షంలో షూటింగ్‌కు సిద్దమవుతున్న హాలీవుడ్ నటుడు

న్యూయార్క్: డేరింగ్ స్టంట్స్‌ చేయడంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ఎప్పుడూ ముందుంటారనే విషయం అందరికి తెలిసిందే. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో ఆయన చేసిన ప్రమాదకరమైన స్టంట్స్ చూసిన వారెవరైనా షాక్ అవ్వక తప్పదు. ఇక ఈసారి ఆయన ఏకంగా అంతరిక్షంలోనే షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. టామ్ క్రూజ్ తదుపరి చిత్ర షూటింగ్ అంతరిక్షంలో జరగనుంది. టామ్ క్రూజ్, చిత్ర దర్శకుడు డౌగ్ లైమన్, మరో నటుడు అక్టోబర్ 2021లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పయనం కానున్నారు. 


ఇందుకోసం చిత్ర బృందం స్పేస్ ఎక్స్ సంస్థ సీఈఓ ఇలాన్ మస్క్ సహాయం తీసుకోనుంది. స్పేస్ ఎక్స్‌కు చెందిన ఆక్సియమ్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్‌సూల్‌ రాకెట్‌లో చిత్ర బృందం అంతరిక్షంలోకి వెళ్లనుంది. అంతరిక్షంలో షూటింగ్ చేసిన మొట్టమొదటి నటుడిగా టామ్ క్రూజ్ చరిత్రలో నిలవనున్నారు. ఇదిలా ఉంటే.. టైటిల్ ఖరారు కాని, స్క్రిప్ట్ పూర్తికాని ఈ చిత్రానికి 20 కోట్ల డాలర్ల(రూ. 1,475 కోట్లు) బడ్జెట్ పెట్టేందుకు యూనివర్శల్ సంస్థ ముందుకొచ్చింది.

Updated Date - 2020-09-24T10:34:56+05:30 IST