దుబాయిలో ప్రారంభమైన నితిన్ కొత్త చిత్ర షూటింగ్

ABN , First Publish Date - 2020-12-07T09:40:09+05:30 IST

కథానాయకుడు నితిన్‌ పక్కా ప్రణాళికతో దుబాయ్‌ వెళ్లారు. అరబ్‌ కంట్రీలోని అందమైన లొకేషన్లలో ‘రంగ్‌ దే’ పాటల చిత్రీకరణ పూర్తి చేసిన

దుబాయిలో ప్రారంభమైన నితిన్ కొత్త చిత్ర షూటింగ్

థానాయకుడు నితిన్‌ పక్కా ప్రణాళికతో దుబాయ్‌ వెళ్లారు. అరబ్‌ కంట్రీలోని అందమైన లొకేషన్లలో ‘రంగ్‌ దే’ పాటల చిత్రీకరణ పూర్తి చేసిన ఆయన వెను వెంటనే తదుపరి సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హిందీ హిట్‌ ‘అంధాధున్‌’ను నితిన్‌ రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా ఆయనకు 30వ చిత్రమిది. ఇందులో ఆయన పియానో ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆదివారం దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని నితిన్‌ ట్వీట్‌ చేశారు. ఆయనతో పాటు హీరోయిన్‌ నభా నటేశ్‌ కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇందులో మరో హీరోయిన్‌ తమన్నా కీలక పాత్రలో కనిపించనున్నారు. జనవరి నుంచి జరగనున్న తదుపరి షెడ్యూల్‌లో ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని నిర్మాతలు ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి తెలిపారు. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్‌ సంగీత దర్శకుడు.

Read more