అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ.. 24 గంటల్లో..

ABN , First Publish Date - 2020-10-31T11:48:21+05:30 IST

అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా నాలుగు రోజులు కూడా లేని వేళ.. అమెరికాలో కరోనా కలకలం రేపుతోంది. గురువారం అక్కడ 91,295 కేసులు నమోదయ్యాయి. జాన్‌హాప్కిన్స్‌ వర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఇవే అత్యధికం.

అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ.. 24 గంటల్లో..

వాషింగ్టన్‌, అక్టోబరు 30: అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా నాలుగు రోజులు కూడా లేని వేళ.. అమెరికాలో కరోనా కలకలం రేపుతోంది. గురువారం అక్కడ 91,295 కేసులు నమోదయ్యాయి. జాన్‌హాప్కిన్స్‌ వర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఇవే అత్యధికం. కాగా, ఈ నెల మధ్య నుంచి అమెరికాలో పాజిటివ్‌లు పెరుగుతున్నాయి. మొత్తం కేసులు 90 లక్షలకు సమీపించాయి. ఇటీవలి వరకు 500లోపునకు పరిమితమైన మరణాలు.. తాజాగా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. కొత్తగా 1,021 మంది మృతిచెందారు.

Updated Date - 2020-10-31T11:48:21+05:30 IST