భారతీయ అమెరికన్ల పేదరికంపై షాకింగ్ నివేదిక !

ABN , First Publish Date - 2020-10-03T15:55:48+05:30 IST

మహమ్మారి కరోనావైరస్ దెబ్బతో అగ్రరాజ్యం అమెరికా సైతం విలవిలలాడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్ కేసులు, మరణాలు యూఎస్‌లోనే నమోదయ్యాయి.

భారతీయ అమెరికన్ల పేదరికంపై షాకింగ్ నివేదిక !

వాషింగ్టన్ డీసీ: మహమ్మారి కరోనావైరస్ దెబ్బతో అగ్రరాజ్యం అమెరికా సైతం విలవిలలాడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్ కేసులు, మరణాలు యూఎస్‌లోనే నమోదయ్యాయి. అలాగే కొవిడ్ ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ఘోరంగా దెబ్బతింది. దీంతో నిరుద్యోగిత పెరిగిపోయింది. ఇదిలాఉంటే... అమెరికాలో నివసిస్తున్న భారతీయుల విషయమై తాజాగా ఓ షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. యూఎస్‌లో ఉంటున్న 4.2 మిలియన్ల మంది ఎన్నారైల్లో 6.5 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు తేలింది. 'ఎ స్టడీ ఆఫ్ పావర్టీ ఇన్ ది ఇండియన్ అమెరికన్ పాపులేషన్' పేరిట జాన్స్ హప్కిన్స్‌కు చెందిన పాల్ నిట్జ్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నెషనల్ స్టడీస్ తరఫున దేవేష్ కపూర్, జాషన్ బజ్వాత్ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. గురువారం జరిగిన ప్రవాస భారత దాతృత్వ సమ్మిట్ 2020లో వారు ఈ నివేదికను విడుదల చేశారు. 


కాగా బెంగాలీ, పంజాబీ మాట్లాడే భారతీయ అమెరికన్లలోనే పావర్టీ అధికంగా ఉన్నట్లు కపూర్ తెలిపారు. అయితే, ఈ పరిశోధనాత్మకమైన నివేదిక వివరాలను పరిశీలించిన అనంతరం తాము దారిద్ర్యరేఖకు అత్యంత దిగువ స్థాయిలో ఉన్న ఇండియన్ అమెరికన్ల దుస్థితిపై దృష్టిసారించాలని నిర్ణయించినట్లు ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు రంగస్వామి చెప్పారు. "కొవిడ్-19 ప్రభావంతో ఆరోగ్యం పరంగా, ఆర్థికంగా రెండు విధాలుగా వినాశనం జరిగింది. దీంతో చాలామంది పేదిరకంలో కురుకుపోయారు. కనుక మనలో ఏర్పడిన పేదరిక సమస్య పరిష్కారంపై చర్చకు ఇదే సరియైన సమయం. తాజాగా వెలువడిన నివేదికలోని విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్లడం మంచిది. అప్పుడే మంచి ఫలితాలను సాధించగలం." అని రంగస్వామి అన్నారు.  

Updated Date - 2020-10-03T15:55:48+05:30 IST