‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఎంత మంది ఇండియాకు చేరారంటే..!

ABN , First Publish Date - 2020-06-25T05:30:00+05:30 IST

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాటు చేసిన ‘వందే భారత్ మిషన్’ ప్రక్రియ కొనసా

‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఎంత మంది ఇండియాకు చేరారంటే..!

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాటు చేసిన ‘వందే భారత్ మిషన్’ ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ మంత్రిత్వ‌శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. మే 7 నుంచి ‘వందే భారత్ మిషన్’ ప్రారంభమవగా.. ఇప్పటి వరకు 3.64లక్షల మంది ఈ మిషన్‌లో భాగంగా ఇండియాకు చేరుకున్నారని తెలిపారు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు దాదాపు 5.13లక్షల మంది ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నట్లు ఆయన చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్‌లో చిక్కుకున్న వారిని రోడ్డు మార్గం ద్వారా ఇండియాకు తరలించినట్లు ఆయన వివరించారు. రోడ్డు మార్గాల ద్వారా ఇప్పటి వరకు 84వేల మంది భారత్ చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. ‘వందే భారత్ మిషన్’ మూడు దశల్లో కలిపి 50 దేశాలకు 875 ప్రత్యేక విమానాలను నడిపినట్లు ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2020-06-25T05:30:00+05:30 IST