సరిహద్దు ద్వారా స్వదేశానికి చేరుకున్న భారత్‌లో చిక్కుకున్న పాకిస్థానీలు
ABN , First Publish Date - 2020-11-27T08:01:19+05:30 IST
కరోనా కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన 200కు పైగా పాకిస్థానీలు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. అట్టారి-వాఘా

న్యూఢిల్లీ: కరోనా కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన 200కు పైగా పాకిస్థానీలు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థానీలు స్వదేశానికి చేరుకున్నట్టు భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వెల్లడించింది. మార్చి నెల ముందు పాకిస్థాన్‌కు చెందిన అనేక మంది వివిధ కారణాల రీత్యా భారత్ వచ్చారు. అయితే భారత ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో వారంతా ఇక్కడే చిక్కుకుపోయారు. అయితే తమ దేశస్థులను సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు పాకిస్థాన్ హై కమిషన్ చొరవ తీసుకుంది. మార్చి 20 నుంచి ఇప్పటివరకు 1100 మంది పాకిస్థానీలు భారత్ నుంచి పాకిస్థాన్‌కు సురక్షితంగా చేరుకున్నారు. భారత్‌లో చిక్కుకున్న పాకిస్థాన్ దేశస్థులందరిని స్వదేశానికి పంపుతామని హై కమిషన్ తెలిపింది. కాగా.. ఇదే సమయంలో అటు పాకిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులు కూడా విడతల వారీగా భారత్‌కు చేరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో స్వదేశానికి పంపే ముందు అధికారులు సరిహద్దు వద్ద కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. కరోనా నెగిటివ్ అని నిర్థారణ అయిన తరువాతే పాక్ నుంచి భారత్‌కు, భారత్ నుంచి పాక్‌కు వెళ్లాల్సి ఉంటుందని ఇరు దేశాలకు చెందిన అధికారులు స్పష్టం చేశారు.