భారత్‌కు మాత్రమే ఆ సామర్థ్యం ఉంది: ఆస్ట్రేలియన్ అంబాసిడర్

ABN , First Publish Date - 2020-12-10T07:30:21+05:30 IST

భారత్‌లోని ఆస్ట్రేలియన్ అంబాసిడర్ బ్యారీ ఓఫెర్రెల్ బుధవారం హైదరాబాద్‌లోని కోవ్యాక్సిన్ అభివృద్ధి చెందుతున్న భారత్ బయోటెక్ ఫె

భారత్‌కు మాత్రమే ఆ సామర్థ్యం ఉంది: ఆస్ట్రేలియన్ అంబాసిడర్

హైదరాబాద్: భారత్‌లోని ఆస్ట్రేలియన్ అంబాసిడర్ బ్యారీ ఓఫెర్రెల్ బుధవారం హైదరాబాద్‌లోని కోవ్యాక్సిన్ అభివృద్ధి చెందుతున్న భారత్ బయోటెక్ ఫెసిలిటీని సందర్శించారు. కోవ్యాక్సిన్ అభివృద్ధిపై ఆయనకు ఉన్న పలు సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారవుతోంది. కానీ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యం కేవలం ఒక దేశానికి మాత్రమే ఉంది. అది భారతదేశమే’ అని అన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. వ్యాక్సిన్‌ ధనిక దేశాలకే కాకుండా అవసరం ఉన్న ప్రతి దేశానికి చేరుకోవాలని కొద్ది రోజుల క్రితం బిల్‌గేట్స్ అన్నారు. 


కాగా.. భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే భారీ మొత్తంలో వ్యాక్సిన్లను తయారుచేస్తున్నవిషయం తెలిసిందే. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, బ్రిటిష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌ సీరమ్ ‌ఇన్‌స్టిట్యూట్‌లోనే తయారవుతోంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తున్న కొవీషీల్డ్(మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్)వ్యాక్సిన్‌కు సంబంధించి అత్యవసర వినియోగ అధికారం ఇవ్వాలంటూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ సోమవారం డ్రగ్ కంట్రోలర్ జెనరల్ ఆఫ్ ఇండయా(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది.  

Updated Date - 2020-12-10T07:30:21+05:30 IST