బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌ ఆందోళనలో హింస

ABN , First Publish Date - 2020-07-27T14:05:00+05:30 IST

నల్ల జాతీయులకు సంఘీభావంగా (బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌) అమెరికాలో టెక్స్‌సలోని ఆస్టిన్‌ నగరంలో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారిం

బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌ ఆందోళనలో హింస

  • టెక్సస్‌ నిరసనలో వ్యక్తి కాల్చివేత

ఆస్టిన్‌, జూలై 26: నల్ల జాతీయులకు సంఘీభావంగా (బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌) అమెరికాలో టెక్స్‌సలోని ఆస్టిన్‌ నగరంలో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ప్రదర్శనకారుల్లో ఓ వ్యక్తిని వ్యాన్‌ డ్రైవర్‌ కాల్చిచంపాడు. శనివారం రాత్రి పది గంటలకు ఈ ఘటన జరిగింది. అలాగే వర్జీనియా రాష్ట్రంలోని రిచ్‌మండ్‌ నగరంలో చేపట్టిన నిరసన ప్రదర్శన కూడా ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు చెత్తను తీసుకెళ్లే ట్రక్కును తగులబెట్టారు. భవనాల అద్దాలను పగలగొట్టారు. 

Updated Date - 2020-07-27T14:05:00+05:30 IST