అమెరికాలో కాల్పుల కలకలం..!

ABN , First Publish Date - 2020-06-21T23:17:37+05:30 IST

అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మిన్నెపోలీస్ నగరంలోని బా

అమెరికాలో కాల్పుల కలకలం..!

వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మిన్నెపోలీస్ నగరంలోని బార్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు ఉన్న పరిసరాల్లో.. గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డట్లు పోలీస్‌లు తెలిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్న అధికారులు.. వారికి ప్రాణాపాయం లేదని చెప్పారు. అయితే కాల్పులకు తెగబడ్డ దుండగుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కాగా.. జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జాతి వివక్షతకు వ్యతిరేకంగా మిన్నెపోలిస్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-06-21T23:17:37+05:30 IST