100 దేశాల పౌరులకు ఒమన్‌లో వీసా ఫ్రీ విజిట్ అవకాశం !
ABN , First Publish Date - 2020-11-03T13:26:22+05:30 IST
గల్ఫ్ దేశమైన ఒమన్ ఏకంగా 100 దేశాలకు చెందిన పౌరులను తమ దేశంలో వీసా అవసరం లేకుండా సందర్శించే అవకాశం కల్పించింది.
మస్కట్: గల్ఫ్ దేశమైన ఒమన్ ఏకంగా 100 దేశాలకు చెందిన పౌరులను తమ దేశంలో వీసా అవసరం లేకుండా సందర్శించే అవకాశం కల్పించింది. 100 దేశాల పౌరులు వీసా లేకుండా సుల్తానేట్ సందర్శించడానికి అనుమతించబడతారని ఒమన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఆ దేశాల జాబితాను మాత్రం ఒమన్ ఇంకా విడుదల చేయలేదు. ఈ నిర్ణయంతో దేశానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరగడంతో పాటు పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జీసీసీ దేశాలైన యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ పౌరులకు మాత్రం వీసా లేకుండా ఒమన్ సందర్శించే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం కొవిడ్ విజృంభణ నేపథ్యంలో విజిట్ వీసా సర్వీసులను ఒమన్ సస్పెండ్ చేసింది.