30 రోజుల పాటు టూరిస్ట్ వీసాలు సస్పెండ్ చేసిన ఒమన్

ABN , First Publish Date - 2020-03-15T16:09:03+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు పైగా విస్తరించిన కరోనావైరస్(కొవిడ్-19) గల్ఫ్ దేశాల్లోనూ కల్లోలం సృష్టిస్తోంది.

30 రోజుల పాటు టూరిస్ట్ వీసాలు సస్పెండ్ చేసిన ఒమన్

ఒమన్: ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు పైగా విస్తరించిన కరోనావైరస్(కొవిడ్-19)  గల్ఫ్ దేశాల్లోనూ కల్లోలం సృష్టిస్తోంది. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తిని నిలువరించేందుకు గల్ఫ్ దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. విమాన సర్వీసుల రద్దు, వీసాల జారీని నిలిపివేస్తున్నాయి. తాజాగా ఒమన్ నెల రోజుల పాటు అన్ని దేశాలకు టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేసింది. మార్చి 15వ తేదీ నుంచి ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని పేర్కొంది. కరోనా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఓ ప్రత్యేక కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా ప్రత్యేక కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని దేశాలకు టూరిస్ట్ వీసాల నిలిపివేత, దేశ వ్యాప్తంగా స్పోర్ట్స్ కార్యక్రమాల రద్దు, విదేశాలకు అనవసర ప్రయాణాలు తగ్గించడం, ఇతర దేశాలకు చెందిన క్రూయిజ్ లైనర్స్ సుల్తానేట్ పోర్టులకు రాకుండా నిలువరించడం వంటి కీలక నిర్ణయాలను ఈ ప్రత్యేక కమిటీ తీసుకోవడం జరిగింది.  

Updated Date - 2020-03-15T16:09:03+05:30 IST