ఒమ‌న్‌లో కోర‌లు చాస్తున్న‌ కోవిడ్.. ఒక్క‌రోజే...

ABN , First Publish Date - 2020-06-18T19:59:18+05:30 IST

ప్రపంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా... అటు గ‌ల్ఫ్‌ను కూడా అత‌లాకుత‌లం చేస్తోంది.

ఒమ‌న్‌లో కోర‌లు చాస్తున్న‌ కోవిడ్.. ఒక్క‌రోజే...

ఒమ‌న్: ప్రపంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా... అటు గ‌ల్ఫ్‌ను కూడా అత‌లాకుత‌లం చేస్తోంది. తాజాగా గ‌ల్ఫ్ దేశ‌మైన‌ ఒమ‌న్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. బుధ‌‌వారం 810 కొత్త కేసులు నమోదైన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఒమ‌న్‌లో ఈ వైర‌స్ సోకిన‌ వారి సంఖ్య 26,079కు చేరింది. ఇక తాజాగా న‌మోదైన 810 కొత్త కేసుల్లో 468 మంది ఒమ‌న్ పౌరులు ఉండ‌గా, 342 మంది విదేశీయులు ఉన్నారని ఆరోగ్య‌శాఖ అధికారులు తెలియ‌జేశారు. నిన్న 708 మంది క‌రోనా రోగులు కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న వారు 11,797 మంది అయ్యారు. అలాగే బుధ‌‌వారం రెండు మ‌ర‌ణాలు సంభ‌వించ‌డంతో ఆ దేశంలో కోవిడ్‌కు బ‌లైన వారి సంఖ్య 116కు చేరింది. ఇదిలా ఉంటే...  ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న‌ క‌రోనా ఇప్ప‌టివ‌రకూ ఏకంగా 4.40 ల‌క్ష‌లకు మందిని బ‌లిగొంది. 84 ల‌క్ష‌ల మంది ఈ వైర‌స్ బాధితులు ఉన్నారు.   

Updated Date - 2020-06-18T19:59:18+05:30 IST