ఒమన్‌లో మహమ్మారి స్వైర విహారం..!
ABN , First Publish Date - 2020-07-18T18:00:33+05:30 IST
ఒమన్‌లో మహమ్మారి కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. రోజురోజుకు అక్కడ ఈ వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.

మస్కట్: ఒమన్‌లో మహమ్మారి కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. రోజురోజుకు అక్కడ ఈ వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం కూడా ఒమన్‌లో 1,619 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో 1,249 మంది ఒమన్ పౌరులు ఉంటే... 370 మంది విదేశీయులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోవిడ్ సోకిన వారి సంఖ్య 64,193కు చేరింది. అలాగే నిన్న 1,360 రికవరీలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోలుకున్నవారు 41,450 మంది అయ్యారు.
ఇక శుక్రవారం సంభవించిన ఎనిమిది మరణాలతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 228 మందిని కరోనా బలిగొంది. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఒమన్ ముమ్మరంగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఒమన్ వ్యాప్తంగా 2,62,869 కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉంటే... ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి ఇప్పటికే 5.99 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అలాగే వరల్డ్‌వైడ్‌గా కోటి 41 లక్షల మంది కరోనా బాధితులు ఉన్నారు.