ఒమన్ మరో కీలక నిర్ణయం !

ABN , First Publish Date - 2020-03-19T15:15:36+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా(కొవిడ్-19) వైరస్ రోజురోజుకూ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి విదేశీయులను(గల్ఫ్ దేశాల పౌరులను మినహాయించి) దేశంలోకి రాకుండా నిషేధం విధించిన ఒమన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఒమన్ మరో కీలక నిర్ణయం !

ఒమన్: దేశ వ్యాప్తంగా కరోనా(కొవిడ్-19) వైరస్ రోజురోజుకూ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి విదేశీయులను(గల్ఫ్ దేశాల పౌరులను మినహాయించి) దేశంలోకి రాకుండా నిషేధం విధించిన ఒమన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ పర్యాటక మంత్రిత్వ శాఖ బుధవారం విదేశాల నుంచి వచ్చిన టూరిస్ట్ గ్రూపులు వెంటనే తమ దేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. కరోనా మహమ్మారిని అరికట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక శాఖ ట్వీట్ చేసింది. శుక్రవారాల్లో చేసే ప్రార్థనలపై కూడా సస్పెన్షన్ విధించిన సర్కార్... పబ్లిక్ పార్కులను మూసివేయించింది. అలాగే సుల్తానేట్‌కు రోడ్డు, సముద్రం, వాయు మార్గాల ద్వారా చేరుకున్న ప్రతి ఒక్కరికీ క్వారంటైన్ వర్తింపజేయాలని నిర్ణయించింది.

Updated Date - 2020-03-19T15:15:36+05:30 IST