25 ఏళ్ల నుంచి బేస్‌మెంట్‌లో నివసిస్తున్న మొసలి.. అసలు విషయం తెలిస్తే..

ABN , First Publish Date - 2020-03-03T01:35:59+05:30 IST

అమెరికాకు చెందిన డస్టీ రోడ్స్ అనే వ్యక్తి తన ఇంటి కింద బేస్‌మెంట్‌లో 25 ఏళ్ల నుంచి మొసలిని పెంచుకుంటూ వస్తున్నాడు. తనంతట తానే

25 ఏళ్ల నుంచి బేస్‌మెంట్‌లో నివసిస్తున్న మొసలి.. అసలు విషయం తెలిస్తే..

ఒహాయో: అమెరికాకు చెందిన డస్టీ రోడ్స్ అనే వ్యక్తి తన ఇంటి కింద బేస్‌మెంట్‌లో 25 ఏళ్ల నుంచి మొసలిని పెంచుకుంటూ వస్తున్నాడు. తనంతట తానే వైల్డ్‌లైఫ్ అధికారులకు స్వచ్ఛందంగా మొసలిని అప్పగించేందుకు డస్టీ ముందుకు రావడంతో.. ఈ వార్త ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఒహాయో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం గ్రోవ్‌పోర్ట్‌లోని తన ఇంట్లో ముసలి ఉన్నట్టు అధికారులకు బ్రెనెమన్ సమాచారమిచ్చాడు. వెంటనే వైల్డ్‌లైఫ్ అధికారులతో పాటు అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఐదు అడుగుల మొసలిని స్వాధీనం చేసుకున్నారు. అడుగు సైజు ఉన్నప్పుడు తాను ఒక మార్కెట్ నుంచి మొసలిని తెచ్చినట్టు డస్టీరోడ్స్ అధికారులకు వివరించాడు. అప్పటి నుంచి తన ఇంటి కింద ఓ టబ్‌లో మొసలిని పెంచుతూ వచ్చినట్టు డస్టీ చెప్పుకొచ్చాడు. కాగా.. మొసలి ఆరోగ్యం మెరుగ్గా లేదని.. మిగతా మొసళ్ల లాగా బలంగా లేదని, సైజు కూడా పెరగాల్సినంత పెరగలేదని వైల్డ్‌లైఫ్ అధికారులు తెలిపారు. మొసలిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని, అక్కడ మెరుగైన చికిత్స అందిస్తామని వైల్డ్‌లైఫ్ అధికారులు పేర్కొన్నారు.  

Updated Date - 2020-03-03T01:35:59+05:30 IST