ఇమ్మిగ్రేషన్ మంత్రిపై కన్నెర్రజేసిన న్యూజిలాండ్ ప్రధాని కారణం ఏంటంటే..!

ABN , First Publish Date - 2020-07-23T05:19:50+05:30 IST

న్యూజిలాండ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డర్న్.. తన క్యాబినెట్‌లోని

ఇమ్మిగ్రేషన్ మంత్రిపై కన్నెర్రజేసిన న్యూజిలాండ్ ప్రధాని కారణం ఏంటంటే..!

విల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డర్న్.. తన క్యాబినెట్‌లోని ఓ మంత్రికి ఉద్వాసన పలికారు. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ మంత్రి ఇయాన్ లీస్ గాల్లోవే.. తన కార్యాలయంలో పని చేసే ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే వార్తలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రధాని జసిండా అర్డర్న్.. ఇమ్మిగ్రేషన్ మంత్రి ఇయాన్ లీస్ గాల్లోవే‌ను.. బుధవారం రోజు పదవి నుంచి తప్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇయాన్ లీస్ గాల్లోవే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటన ప్రస్తుతం  న్యూజిలాండ్‌లో చర్చనీయాంశం అయింది.  


Updated Date - 2020-07-23T05:19:50+05:30 IST